రోడ్ల దుస్థితి పై చాట్రాయి జనసేన డిజిటల్ క్యాంపెయిన్

చాట్రాయి మండలం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సూచనల మేరకు #GoodMorningCMsir అనే హ్యాష్ ట్యాగ్ తో నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరియు ఎమ్మెల్యే గారిని లేపే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో (చనుబండ – కొర్లమండ రోడ్డు), సి.గుడిపాడు గ్రామంలో (సి.గుడిపాడు – పర్వతాపురం రోడ్డు), నరసింహారావు పాలెం (నరసింహారావుపాలెం – పిట్టవారిగూడెం, బూరుగగూడెం) రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ నిరసన తెలపటం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి మొఒడ్రు సురేష్, కార్యదర్శి మిద్దె హరీష్, దేసిన సాయి, మిద్దె కృష్ణ, షేక్ బాబావలి, మిద్దె వెంకటేశ్వరరావు మరియు జన సైనికులు పాల్గొన్నారు.