మృతుల కుటుంబాలను పరామర్శించిన చేబ్రోలు జనసైనికులు

పిఠాపురం నియోజకవర్గం, జనసేన నాయకులు మరియు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన జనసైనికుడు విప్పర్తి సందీప్‌ అనారోగ్యంతో మరణించారు. వీరి కుటుంబాన్ని నియోజకవర్గం జనసేన నాయకులు మరియు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు విప్పర్తి సందీప్ తలిదండ్రులైయిన విప్పర్తి నాగలక్ష్మి సింహచలంను పరామర్శించి విప్పర్తి సందీప్ మరణం పట్ల ప్రగాడసానుభూతిని తెలియజేసి, విప్పర్తి సందీప్ పవిత్రాత్మకి శాంతి చేకూరాలని మౌనం పాటించారు. కుటుంబం ఆర్ధిక పరిస్థితి గూర్చి తెలుసుకొని సాయిప్రియ సేవాసమితి వ్యవస్థస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు చేబ్రోలు గ్రామ జనసైనికుల సమక్షంలో మృతుడు సందీప్ తల్లిదండ్రులకు తగు ఆర్థికసహాయం అందజేసారు. ఈ కార్యక్రమంలో అడ్డాల నాగబాబు, అల్లం దోరబాబు జనసేన గౌరవ అధ్యక్షులు, ముట్టాల సత్తిబాబు జనసేన మండల సంయుక్త కార్యదర్శి, జనసైనికులు దమ్ము చిన్న, జనసైనికులు పెద్దింటి శివ, గంటా గోపి, దోండపాటి లోవరాజు, బోండపాటి అప్పన్న, దోండపాటి ధర్మయ్య, కారకాటి శ్రీను, కారకాటి అప్పారావు, దోండపాటి అప్పారావు, కోతల నూకరాజు, జ్యోతుల వాసు, మేడిబోయిన శ్రీను, జ్యోతుల సీతరాంబాబు, జాన్, సాయిప్రియ సేవాసమితి, పిఠాపురం మండల కార్యదర్శి మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.