కాలుష్యానికి చెక్: రేణు దేశాయ్

సినిమాలు, టీవీ షోలతో సంబంధం లేకుండా.. తరచుగా వార్తల్లో ఉండే అతి కొద్దిమంది సెలబ్రిటీలలో రేణు దేశాయ్ ఒకరు. అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉంటారు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ తో ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అదేమంటే.. రాబోయే రోజుల్లో వాహనాలు కొనేవారు ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలకే  ప్రాధాన్యత ఇచ్చి… పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్ కార్లను పక్కకు పెట్టాల్సిందిగా రేణు దేశాయ్ సూచించారు. అప్పుడే మనం కాలుష్యానికి చెక్ పెట్టొచ్చని చెప్పిన రేణు దేశాయ్.. అందులో భాగంగానే తాను కూడా తన వద్ద ఉన్న Audi A6, Porsche boxter లగ్జరీ కార్లను అమ్మేసి విద్యుత్ తో నడిచే electric Hyundai Kona కారును కొనుగోలు చేశానంటూ తన కొత్త కారు ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.   మారిషస్ లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో భూమిపై నివసించే జీవరాశులకు క్యాన్సర్ అందిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ ఆలోచన కూడా మంచిదే కదా అంటున్నారు ఆమె పోస్టు చూసిన నెటిజెన్స్.