సమాచార హక్కు చట్టం సహాయంతో గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేయించిన కణితి కిరణ్

సంతబొమ్మాళి మండలం, మూలపేట గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయంలొ ప్రభుత్వ పథకాల జాబితాలు, ఇంటిపన్ను వసూళ్ల రికార్డులు, గ్రామ పంచాయతీ గ్రాంట్ రికార్డులు, పంచాయితీ సంబందించి పలు రికార్డులు సమాచార హక్కు చట్టం సహాయంతో తనిఖీ చేయడం జరిగింది. అలాగే స్థానిక జనసైనికులు ఇచ్చిన సమాచారం మేరకు అర్హులైన కొందరికి ప్రభుత్వ పథకాలైన చేయూత, మరియు సామాజిక పింఛన్ల మంజూరు లోపాలపై అడిగి సమస్య పరిష్కారానికి చొరవచూపాలని కోరడమైంది, పాలనలో పారదర్శకత తో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవినీతికి త్రోవలేకుండా.. ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విదంగా మరియు గ్రామంలో జరిగే పనులకి సంబందించి నాణ్యత లోపాలు తెలుసుకొనుటకు సమాచార హక్కు చట్టాన్ని ప్రతి పౌరుడు ఉపయోగించుకోవాలి అంటూ.. జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ తెలిపారు. అలాగే మూలపేట గ్రామపంచాయతీలొ రికార్డుల పరిశీలనలో 2018-2020 సంవత్సరాలకు గాను ఎటువంటి ఇంటిపన్ను రసీదు పుస్తకాలు, ఛలానా లు లేవని, పంచాయతీకి స్టాక్ రిజిస్టర్ లేదని, పంచాయతీకి జి.ఎస్.టి నెంబర్ లేదని తమ దృష్టికి వచ్చిందని మరిన్ని వివరాలు కావాలని తెలుపగా పంచాయితీ కార్యదర్శి వారం రోజుల లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సహకరించిన పంచాయతీ కార్యదర్శి మార్పు రామానాయుడుకు మరియు అతని సిబ్బందికి టెక్కలి జనసేన పార్టీ తరుపున కణితి కిరణ్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ రికార్డుల తనిఖీ కార్యక్రమంలో లాయర్ ముడిదాన రాంప్రసాద్, అనపాన జనార్దన్ రెడ్డి, మూలపేట జనసేన నాయకులు భాస్కర్ రెడ్డి, బాలరాజు, గణేష్ పాల్గొన్నారు.