జాతీయ రైతు దినోత్సవ వేడుకలలో చీపురుపల్లి జనసేన

చీపురుపల్లి: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతు దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలంలో కొంత మంది రైతులకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో విసినిగిరి శ్రీను, తుమ్మగంటి సూరి నాయుడు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం రైతులను మర్చిపోయింది అని, రైతులకి ఇవ్వాల్సిన పరిహారాలు ఇవ్వడం కూడా మర్చిపోయింది అని, కనీసం గిట్టు బాటు ధర ఇవ్వకుండా, రైతుల నుండి ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితిలో కూడా లేదు అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన మూడున్నర సంవత్సరాలలోనే రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పట్టించుకోలేదు అని, వారిని ఆదుకొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి 1 లక్ష చొప్పున 30 కోట్లు పరిహారం ఇస్తుంటే ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనిలో ఉందే గానీ, రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పారు. అలాగే జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత సోలార్ యూనిట్లు అలాగే, 60 సంవత్సరాలు దాటిన కౌలు రైతులకు నెలకు 5000 ఇస్తారు అని, అలాగే వ్యవసాయం చేయాలి అనుకునే యువ రైతులకి ప్రభుత్వ భూమిని లీజకు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తాం అని చెప్పారు. ఈ కార్యక్రమం లో టి. సూరి నాయుడు, రామచంద్ర రాజు, ఆదినారాయణ, రామచంద్ర రావు, లక్ష్మణ నాయుడు, తవిటి నాయుడు, కిరణ్, నరసింహ అలాగే జనసైనికులు పాల్గొన్నారు.