ఫార్మా రంగంలో కెమిస్ట్రీ సబ్జెక్టుకు అత్యున్నత అవకాశాలు – రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు

— ఏ.కే.యూలో విజయవంతమైన అతిథి ఉపన్యాసం

గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కెమిస్ట్రీ విభాగం నందు ప్రతిభా, పాటవాలు కలిగిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఎంతగానో ఉందని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్, కెమిస్ట్రీ డిపార్టుమెంటు హెడ్ ప్రొఫెసర్ బి హరిబాబు అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్శిటీ సమావేశపు హాలులో జరిగిన అతిథి ఉపన్యాస కార్యక్రమానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏ.కే.యూ కెమిస్టీ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో “కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ ఆర్గానిక్ కెమిస్ట్స్ ఇన్ ఫార్మా” అనే అంశం మీద అతిథి ఉపన్యాస కార్యక్రమము నిర్వహించ బడింది. ఈ కార్యక్రమంలో అతిథి ఉపన్యాసకులుగా స్క్రిప్ట్స్ ఫార్మా వైస్ చైర్మన్ డాక్టర్ వరాల రవి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఫార్మా రంగం నేడు ఎంతగానో విస్తరిస్తోందని అన్నారు. ఫార్మా రంగానికి కెమిస్ట్రీ విభాగం అనుబంధ రంగంగా ఉంటుందని అందువల్లనే కెమిస్ట్రీ విభాగంలో మంచి ప్రావీణ్యం కలిగిన విద్యార్థులకు ఫార్మా రంగంలో అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుందని, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా మందుల తయారీ విభాగంలో కెమిస్ట్రీ విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు లాభిస్తున్నాయని, అందివస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి రాజమోహన్ రావు, కెమిస్ర్టీ సహాయ ఆచార్యులు డాక్టర్ ఉబ్బా ఈతముక్కల, జాస్మిన్, ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కెమిస్ట్రీ విభాగానికి చెందిన పలువురు స్కాలర్లు, విద్యార్ధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అతిథి ఉపన్యాసకులు డాక్టర్ వరాల రవిని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావుల ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Share this content:

Post Comment