మదనపల్లెలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

మదనపల్లె, చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి సందర్భంగా మదనపల్లె చిత్తూరు బస్టాండ్ నందు మరాఠా సంఘం ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో మదనపల్లి శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా గారు,జనసేన రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, జనసేన నాయకులు కోటకొండ చంద్రశేఖర్, కుప్పాల శంకర, డాకరాజు ముఖ్య అతిధులుగా హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షాత్ భవాని మాత ప్రత్యక్షమై ఖడ్గం ప్రసాదించిన మహోన్నతమైన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, అతి తొందరలో ఛత్రపతి శివాజీ వారి కాంస్య విగ్రహం ఆవిష్కరణ చిత్తూరు బస్టాండ్ కూడలిలో చేస్తున్నామని, చరిత్ర సృష్టించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వారి చరిత్ర అందరూ తెలుసుకోవాలని, శివాజి తల్లి జిజియా బాయ్ లాగే నేటి తరం తల్లులు శివాజీ మహారాజ్ లాంటి వారిని ప్రతీ కుటుంబం నుండి తయారుచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఛత్రపతి శివాజీ గారి కాంస్య విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మరాఠి నాయకులు, పట్టణ ప్రజలు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment