ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: మెరుపుల మహేష్

నగరి, అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తానని నమ్మబలికి వారితో‌, వారి కుటుంబాలతో ఓట్లేయించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారితో కనీసం ముఖాముఖి చర్చలకు కూడా ఆహ్వానించకుండా, వారి సమస్యలను నెరవేర్చకుండా వారిని, వారి కుటుంబాలని సమ్మెలు చేసే స్థితికి తీసుకురావడం శోచనీయమని, వారిని వెంటనే చర్చలకు ఆహ్వానించి, వారి న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని నగరి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాద్యులు మెరుపుల మహేష్ డిమాండ్ చేసారు. వారి పోరాటానికి జనసేన అండగా ఉంటుందని సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ లీడర్ గోపి రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కటికం నాగార్జున, నగరి మండల అధ్యక్షుడు దేవ, ఐటీ ప్రెసిడెంట్ శానంపూరి అశోక్, పుత్తూరు మండల ప్రధానకార్యదర్శులు కమతం చైతన్య సాగర్,జితేంద్ర, శ్రీరామ్ గోపి, గోవింద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేశవులు, సీపీఎం పట్టణ కార్యదర్శి వెంకటేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి మహష్ తదితరులు పాల్గొన్నారు.