ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పనుల ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరా శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, జలవనురుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్, వైబ్రో కంప్యాక్షన్ ప్రాంతాలను పరిశీలించిన తదుపరి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం సమావేశం నిర్వహించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎంతో సమన్వయంతో, త్వరితగతిన పూర్తి చేయడానికి అందరూ సహకరించి పని చేయాలని అధికారులకు సన్నాహాలు, సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ,చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు ,జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, కట్ట సింహచలం ఐ.ఏ.ఎస్, జెసి దాత్రి రెడ్డి, ఎస్పీ కిషోర్, అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు , జెడ్పీ చైర్మన్ పద్మ, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ రమణ, పోలవరం డిఎస్పి వెంకటేశ్వరరావు, డిఎం సివిల్ సప్లై శ్రీలక్ష్మి, డీఎస్ఓ ప్రతాపరెడ్డి, డి సి హెచ్ డాక్టర్ పాల్, జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్నబాబు, ఏపీ ఈపీడీసిల్ సాల్మన్ రాజు, పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, 7 ఏడు మండలాల జనసేన ప్రెసిడెంట్లు, టిడిపి ప్రెసిడెంట్లు, బిజెపి ప్రెసిడెంట్లు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment