అసహనంలో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి: ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గం: గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనానికి లోనైనట్టు కనిపిస్తుందని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విలువలతో కూడిన బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి స్థాయి మరిచి దిగజారుడు మాటలు వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసహనాన్ని గురిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు నిర్వహించే ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ద్వేషిస్తూ నిందిస్తూ ప్రసంగించడం ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తులకు తగదు. ప్రతి సభలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి ప్రస్తావించవలసిన అవసరం ఏముంది. జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన గురించి, చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారనిపిస్తుంది. శనివారం జరిగిన వెంకటగిరి సభలో ముఖ్యమంత్రి ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుండి వస్తున్న స్పందనను జీర్ణించుకోలేక కడుపు మంటతో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంత నిందించినా 2024లో పవన్ కళ్యాణ్ విజయాన్ని మీరెవరు ఆపలేరు. 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం అని ఎస్ వి బాబు హెచ్చరించారు.