కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో చినపలకలూరు గ్రామం నుండి తుమ్మల ఏడుకొండలుకి 62800/- అలానే తుమ్మల పాలెం గ్రామం నుండి బండారు వినాయక్ కి 50250/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కర్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ పేదలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి రుజువైంది అని, ఈ చెక్కులను అందించినందుకు మా ఎంపీ మరియు ఎమ్మెల్యేలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ మాకు రావటానికి అహర్నిశలు కృషి చేసిన డేగల లక్ష్మణ్ కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.
Share this content:
Post Comment