*జనసేన నేత సామినేని ఉదయభాను
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొంటూ, ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) పేద ప్రజల కోసం ఓ వరంలా మారిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటోందని వివరించారు. జనసేన పార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరియు తన కృషితో, జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన పసుపులేటి అనురాధ (భర్త రాజేష్) గారికి రూ.74,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరైందని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని చిల్లకల్లు రోడ్డుపై ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, లబ్ధిదారురాలు అనురాధకి జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను స్వయంగా చెక్కును అందజేశారు. అనంతరం అనురాధ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు, జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభానుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment