ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రోడ్డు నందు ఎల్.జి షోరూం పక్కన జనసేన పార్టీ నాయకులు సరితాళ దస్తగిరి నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గూగూడు కుల్లాయి స్వామి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాంటును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడాలని ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని అధునాతన సాంకేతికతతో నీటి శుద్ధి ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
Share this content:
Post Comment