బీరే ఈశ్వర్ ను పరామర్శించిన చిలకం మధుసూదన్ రెడ్డి

  • వైసీపీ గుండాల దాడిలో తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితి నుండి కోలుకుంటున్న బేరే ఈశ్వర్ ని పరామర్శించి జనసేన పార్టీ తరపున 30 వేల రూపాయల చెక్కును అందజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

పెనుగొండ నియోజకవర్గం: గోరంట్ల మండలంలో ఈ వార్త చైర్మన్ బీరే ఈశ్వర్ ఉన్న వాస్తవాలు వార్తల రూపంలో రాయడంతో వైఎస్ఆర్సిపి గుండాలు దాడి చేయడం జరిగింది. ఈ దాడి వలన ఈశ్వర్ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడి తన స్వగృహంలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో ఈశ్వర్ గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ దాడి చేయడం ఇది రెండోసారని ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ దాటి చేసింది ఎవరైనా సరే వారిని కచ్చితంగా శిక్షించే వరకు పోరాడతామని హామీ ఇచ్చి జనసేన పార్టీ వారికి అన్ని సహాయ సహకారాలు అందించి అన్ని విధాలుగా అండగా ఉంటుందని జనసేన పార్టీ తరపున 30 వేల రూపాయల చెక్కును జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అందజేసారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల కన్వీనర్ సంతోష్, జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆబు, పుట్టపర్తి నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర, మండల ఉపాధ్యక్షుడు నరేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, గోవిందప్ప, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు, గోట్లురు జీవి, కోటికి రామాంజి, తలారి ప్రతాప్ మరియు తదితరులు పాల్గొన్నారు.