ధర్మవరం ప్రజలకు క్షమాపణలు తెలియజేసిన చిలకం మధుసూదన రెడ్డి

ధర్మవరం, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ సేవ్ ధర్మవరం కార్యక్రమంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి భరోసా కల్పించి అవన్నీ నెరవేర్చలేకపోతున్నందుకు ధర్మవరం ప్రజలు క్షమించాలని కోరారు. అలాగే మిత్రపక్ష అభ్యర్థిగా బిజెపి సత్య కుమార్ యాదవ్ ను నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకొని ఆ విషయాలన్నీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని అలాగే బిజెపి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కు తెలియజేస్తానని అదేవిధంగా ప్రజాభిప్రాయం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం అలాగే పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు మా నిర్ణయాన్ని తెలియజేస్తామని పేర్కొన్నారు.