వైఎస్ జగన్ రెడ్డి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ని విమర్శించిన సంగతి తెలిసిందే అయితే గురువారం రోజున వెంకటాచలం మండల కేంద్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి కాకి శివ కుమార్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోటికి అదుపులేకుండా పోతుందన్నారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చుని పెడితే సిగ్గు లేకుండా పిల్ల కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ ని అనే స్థాయి జగన్ కి లేదు అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతుంటే జగన్ మా అధినేత ఎదుగుదలను చూసి ఓర్వలేక అకసుతో మాట్లాడుతున్నాడు. ఇదే కొనసాగితే ఆయన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి పోయి ప్రజల సమస్యలు గురించి మాట్లాదాల్సింది పోయి అభివృద్ధిని పరుగులు పెట్టించే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ని అనడం, చేత కానీ మాటలు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు అస్తోటి రవి, మండల నాయకులు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment