ఇన్ని రోజులు ఏమయ్యావ్- ఎమ్మెల్యే ఆర్కేను ప్రశ్నించిన చిల్లపల్లి

  • నూతక్కి – చిర్రావూరు గ్రామాల మధ్యలో ఉన్న పంట పొలాలు కొన్ని రోజుల క్రితం నీటి మునిగితే ఇప్పుడు గుర్తొచ్చిందా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి నియోజకవర్గం: గత కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు నూతక్కి – చిర్రావూరు గ్రామాల మధ్యలో నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. దాదాపుగా ఆ పంట పొలాలు నీటి మునిగి 10 & 15 రోజులు అవుతుంటే మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆర్కే మంగళవారం వెళ్లి నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించామంటూ రెండు మూడు ఫోటోలు దిగి వచ్చారు. ఇన్ని రోజులు ఏమయ్యావ్ ఎమ్మెల్యే ఆర్కే ఈరోజు గుర్తొచ్చిందా..? అని జనసేన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నీట మునిగిన చిర్రావూరు – నూతక్కి గ్రామాల 100 ఎకరాల పైగా పంట భూమి గత కొద్ది కాలం క్రితం నూతక్కి నుండి ప్రాతూరు వరకు వేసిన రోడ్డు దానిలో భాగంగా పంట పొలాలలోని నీరును బయటకు పెట్టే తూములను తొలగించి నిర్లక్ష్యంగా రోడ్డు నిర్మాణం చేయడం వలన ఏ కొద్దిపాటి వర్షం వచ్చిన నీరు బయటకు వెళ్లలేక అక్కడే నిలిచిపోవడం వలన పంట పొలాలు చెరువుల్లాగా తయారవుతున్నాయి. ఆంధ్ర రత్న పంపింగ్ స్కీం 3600 ఎకరాల పంట కాలవ కుంచనపల్లి అపర్ణ తదితర అపార్ట్మెంట్లు యొక్క మురుగునీరును పంట కాలవలలోకి పెట్టడం వలన 3600 ఎకరాలకు సాగునీరు అందించవలసిన పంట కాలువలో మురుగు నీరు ప్రవహించడం వల్ల పంట భూములు దెబ్బతింటున్నాయని చిల్లపల్లి శ్రీనివాసరావుకు రైతులు వివరించారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, తొలగించిన తూములు మళ్లీ ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.