డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూరులో చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఏపి మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి మిద్దె సెంటర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి అని ఆ స్వామిని దర్శించుకుని ప్రార్ధించడం జరిగింది. డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేసిన మంచి మార్క్ శంకర్ ను కాపాడింది. ప్రజల ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబంపై ఉంటాయి. ప్రమాదం గురించి తెలిసి కూడా ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం అయిన ప్రజల సమస్యలు పరిష్కరించి అయిన సింగపూరు వెళ్లారు. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల ప్రజల చల్లని దీవెనలతో మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి & మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేడిశెట్టి కిషోర్, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, ఎంటిఎంసి కార్యదర్శి షేక్ వజీర్ భాష, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, గంజి చిరంజీవి, జొన్న రాజేష్, తిరుమలశెట్టి గోపీనాథ్, తాడేపల్లి పట్టణ 19వ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకుల సాయి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment