అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చిల్లపల్లి

మంగళగిరి ఆటోనగర్ లోని ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా అధికారులతో ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య సేవలో గొప్ప సేవ చేయడం ద్వారా సమాజానికి మంచి చేయవచ్చు. అలాంటి సేవలను మన ద్వారా పేద ప్రజలకు అందించేందుకు, నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య సంరక్షణ మరియు మెరుగైన వైద్య సేవలను ప్రతి పేదవానికి అందించే దిశగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ అధ్యక్షతన ఏపిఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా ఆధ్వర్యంలో మనమందరం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ మరియు అభివృద్ధి పనులపై ఆరా తీస్తూ వంద పడకల ఆసుపత్రులను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దాలని దేశానికి రోల్ మోడల్ గా ప్రభుత్వ ఆసుపత్రులు నిలవాలనే మంత్రివర్యులు లోకేష్ ఆలోచనలను నెరవేర్చేలా.. ప్రతి జిల్లాలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సి.డి.ఎస్) నందు అన్ని మందులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా నిల్వచేసి గడువు ముగిసినా మందుల పారవేయు తగు విధానాలపై, గత ప్రభుత్వం పెండింగులో ఉంచిన బకాయిలను త్వరలోనే చెల్లించేలా చర్యలు తీసుకోవడంపై, టెండర్లు, కాంట్రాక్టులను సింగిల్ విండో విధానంతో సులభతరం చేయడం, కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా నిర్మించిన మెడికల్ కాలేజీలపై, నాబార్డ్ పథకం ద్వారా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రులపై, క్యాన్సర్ కేర్ ఆసుపత్రి మరియు ఆధునిక క్యాన్సర్ సంరక్షణను అందించేలా కాన్సర్ ఆసుపత్రులు. ఏపిఎంఎస్ఐడిసి ఉద్యోగుల ఆరోగ్య భీమా వర్తింపు మరియు అమలు, ఆధునిక వసతులు, అధునాతన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు మరియు పలు అభివృద్ధి అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఏపిఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపిఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ గిరిషా, ఏపిఎంఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ కె.శ్రీనివాసరావు, జి.సుధాకర్ రెడ్డి, పి. హర్షవర్ధన్ రావు, అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Share this content:

Post Comment