మెడికల్ క్యాంపు ఏర్పాట్లు పరిశీలించిన చిల్లపల్లి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో జరగబోతున్న నేపథ్యంలో, ఈ మహా సభలో పాల్గొనబోయే రాజధాని రైతులు, ప్రజలు, నాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, వెలగపూడిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను పరిశీలించారు. క్యాంపులో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, మందుల నిల్వలు, అత్యవసర వైద్య సదుపాయాలు వంటి అంశాలను సమీక్షించారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు అందించి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. “అనేక వేల మంది ప్రజలు పాల్గొనబోతున్న ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎవరూ ఆరోగ్య పరంగా ఇబ్బంది పడకూడదని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందుబాటులో ఉండాలి,” అని ఛైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకుని, మెడికల్ సిబ్బందికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. ప్రజల సేవలో అప్రమత్తంగా నిలుస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, వైద్య శాఖకు నాయకులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Share this content:

Post Comment