మంగళగిరి, మంత్రి లోకేష్ ఆదేశాలతో “స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ మంగళగిరి” కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం అంతటా ముప్పై రోజుల్లో అన్ని వార్డుల్లో నిర్వహించేలా చేపట్టడం చాలా శుభకరం. ఈ కార్యక్రమం ద్వారా మున్సిపల్ పరిపాలనలో మార్పు తీసుకురావడం, ప్రజల్లో శుభ్రత చైతన్యం పెంచడం మరియు మౌలిక వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆరోగ్యం మరియు స్వచ్ఛమైన వాతావరణాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంతో ఆ లక్ష్యాలను సాధించేందుకు, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం, దుర్గంధాలు లేకుండా వాతావరణం ఏర్పరచడం, క్షేమ కార్యక్రమాలను రూపొందించడం, మరియు ప్రజలకు శుభ్రత మరియు ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని ఆలోచనలకు అనుగుణంగా ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంటిఎంసి కమిషనర్ అలీమ్ బాషా పర్యవేక్షణలో అసిస్టెంట్ కమిషనర్ శకుంతలా దేవి సమక్షంలో గురువారం మంగళగిరి పట్టణంలోని 17 మరియు 18 వ వార్డు నందలి స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ…. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆరోగ్య మరియు ఆనంద ప్రాంతంగా మార్చేందుకు కంకణం కట్టుకున్న మంగళగిరి శాసనసభ్యులు & మంత్రివర్యులు లోకేష్ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన ఆశయం, మంగళగిరి నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడం. కావున, సుస్థిర వాతావరణం, శుభ్రత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెడుతూ వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య చర్యలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టి మన మంగళగిరిని ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రోల్ మోడల్ ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో మనమందరం కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, ఎంటిఎంసి జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ కైరుల్లా, మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు జనసేన నాయకులు గంజి చిరంజీవి, ఎంటిఎంసి కమీషనర్ అలీమ్ బాషా, అసిస్టెంట్ కమిషనర్ శకుంతలా దేవి, సెక్రటరీ దివ్య కుమారి, కార్పొరేషన్ పర్యవేక్షణ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, శానిటేషన్ విభాగం అధికారులు, 10వ సచివాలయ సిబ్బంది, శానిటరీ వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment