పాత మంగళగిరిలోని బోసుబొమ్మ సెంటర్ నందు గల ఎస్.ఎల్.ఎం చైతన్య యు.పి.స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొని సందేశాత్మకంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు. అనంతరం, ఎస్.ఎల్.ఎం. విద్యాసంస్థల వ్యవస్థాపకులు సిందె బాలకృష్ణ మాస్టర్, స్కూల్ ప్రిన్సిపల్ చిల్లపల్లి శ్రీనివాసరావుని శాలువాతో సత్కరించి, మెమెంటోను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలు సందేశాత్మకంగా చేసిన నృత్యాలు నేటి తరం యువతరానికి బాల్యం నుంచే ఎంతో అవసరం, శుభకరం మరియు శ్రేయస్కరం కూడా ప్రతి విద్యార్థి స్థిరత్వానికి గురువులే ప్రప్రథమం. మొబైల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ వినియోగాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటూ వినూత్నాత్మక ఆవిష్కరణలకు దోహద పడుతుంది. మీ యొక్క ఇష్టమైన రంగాలలో రాణిస్తూ మీరు స్థిరపడమే కాకుండా మీ తోటి వారికి సహాయపడే స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపి పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి, ఎస్.ఎల్.ఎం. విద్యాసంస్థల వ్యవస్థాపకులు సిందె బాలకృష్ణ మాస్టర్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ నందం మోహనరావు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment