నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిల్లపల్లి

మంగళగిరి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరి జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ ను వారి నివాసంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ మంగళగిరి జనసేన ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పొత్తుదర్మంలో భాగంగానే కలిశామని మా కేడర్ టీడీపీ అంతా కలిసి పనిచేయటం కోసమే ఈ కలయిక అని చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు మంగళగిరి నియోజకవర్గ జనసేన కోర్ కమిటీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.