సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న చిల్లపల్లి

భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ అద్భుతమైన పరిశోధన రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్ నందు గల నారాయణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు సైన్స్ ఫెయిర్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఫెయిర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు పొందాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వారిలో ఉన్న సృజనాత్మకను వెలుగు తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలుపుతూ విద్యార్థుల్లో ఉన్న ఆలోచనలనూ ఆచరణలో పెడుతూ ఏకాగ్రతతో, గొప్ప సృజనాత్మకతను పెంపొందించేలా చేస్తాయని తెలిపారు. మీ యొక్క ఆసక్తి రంగాలలో రాణిస్తూ మీ తోటి మిత్రులకు, సమాజానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేస్తూ, చదువులో కూడా ఉత్తీర్ణులుగా అవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదనరావు, జనసేన యువజన నాయకులు చిట్టెం అవినాష్, నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, స్కూల్ అధ్యాపకులు, సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment