మంగళగిరి: శుక్రవారం ఉదయం మంగళగిరి ఆటోనగర్ లోని ఏపిఎంఎస్ఐడిసి కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గం, చినకాకానిలోని యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆంకాలజీ వింగ్ & రీసెర్చ్ సెంటర్ ఆవరణలో నిర్మించనున్న వంద పడకల వైద్యశాలకు రోగి-కేంద్రీకృత డిజైన్, ఇన్ఫెక్షన్ నియంత్రణ, స్థిరత్వం మరియు పలు కీలక అంశాలపై చర్చించి ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు. ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆశయాల్లో భాగంగా మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సంపూర్ణ వైద్య సేవలను అందించేలా మౌలిక వసతులు మరియు సదుపాయాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎంఎస్ఐడిసి సీఈ జి. సుధాకర్ రెడ్డి, ఎస్‌ఈ వి.చిట్టిబాబు, ఈఈ సీవీ రమణ, డీఈఈ ఎమ్.హనుమంతరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment