మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జనసైనికుడిని పరామర్శించిన చిల్లపల్లి

మంగళగిరి నియోజకవర్గం: తాడేపల్లి మండలం, చిర్రావూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మక్కె గోపినాథ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు దృష్టికి రావడంతో శనివారం ఉదయం మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మక్కె గోపినాథ్ ను కలిసి పరామర్శించడం జరిగింది. అలాగే చికిత్సకు సంబంధిత వైద్యులతో మాట్లాడి మక్కె గోపినాథ్ ఆరోగ్య స్థితిని తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పార్టీ పెద్దలతో మాట్లాడి క్రియాశీలక సభ్యత్వంకు సంబంధించిన ప్రమాద ఇన్సూరెన్స్ ను త్వరగా వచ్చేలా చూస్తామని, జనసేన పార్టీ మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మక్కె గోపినాథ్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. చిల్లపల్లితో పాటు రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, చిర్రావూరు గ్రామ అధ్యక్షులు అంకం కాళీ కృష్ణ, మంగళగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్ తదితరులు పాల్గొన్నారు.