తోటవారిపాలెం బైపాస్ రోడ్ వద్ద చలివేంద్రం ఏర్పాటు

చీరాల, వేసవికాలం ప్రజల దాహార్తిని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఆద్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉమ్మడి కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్, చీరాల నియోజకవర్గం, తోటవారిపాలెం బైపాస్ రోడ్ వద్ద చలివేంద్రం ఏర్పాటుచేయడం జరిగింది. అలాగే వారం వారం మజ్జిగ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చీరాల టిడిపి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనలు, సహాయ సహకారాలు మరువలేనివి. అలాగే తోటవారిపాలెం టిడిపి నాయకులు లీలావతి, కత్తుల నాగరాజు, బిజెపి నాయకులు హేమంత్, వెంకటరమణ, కుమార్, నాగేశ్వరావు,మణి, చంద్ర, భవాని, మార్కండేయలు, ప్రసాద్, బ్రహ్మ, హనుమయ్య, రామకృష్ణ, సుబ్బారావు, గురవయ్య, రాంబాబు, జనసేన పార్టీ వీర మహిళలు లక్ష్మీ, కోటేశ్వరీ భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి, వీరమ్మ, జ్యోతి పాల్గొన్నారు

Share this content:

Post Comment