కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన చిన్నారాయల్

పుంగనూరు: రాజంపేట ఎన్డీయే ఉమ్మడి ఎంపీ అభ్యర్థి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జ్ సిరివేలు చిన్నారాయల్ మర్యాద పూర్వకంగా కలిసి ఎన్నికల ప్రణాళికపై చర్చించి పుంగనూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిలను గెలిపించే దిశగా అడుగులు ముందుకు వేయాలని ఆయన సూచించారు. మా అది నాయకుడి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ సంపూర్ణ ఉమ్మడి అభ్యర్థిలను గెలిపించుకునే దిశగా పనిచేస్తామని నియోజకవర్గ చిన్నారాయల్ చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనియర్ మధన్ మోహన్, ఎస్సీ సెల్ నాయకులు కే వీ రమణ, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్రబాబు, సామల మండల అధ్యక్షులు భూషణ్ రాయల్, పుంగనూరు మండల అధ్యక్షులు పాముల హరి మరియు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.