జగన్ రెడ్డిపై ధ్వజమెత్తిన చింతా రేణుకారాజు

జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్టు మాట్లాడిన జగన్ రెడ్డికి మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని గుంటూరు నగర జనసేనపార్టీ ఉపాధ్యక్షుడు రేణుకా రాజు విమర్శించారు. జనసేనపార్టీకి 21సీట్లు వైసిపికి 11సీట్లకు పరిమితం చేసారు కాబట్టి పవన్ కళ్యాణ్ ని చూసి భయపడుతున్నావు అని అర్థమవుతుంది అని రేణుకా రాజు అన్నారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి దోచుకున్న డబ్బుతో అహంకారం గర్వం ఇంకా తగ్గలేదు. ఏమి పర్లేదు ప్రజలు తగ్గిస్తారు. ఎన్నికలలో ప్రచారం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పారు నిన్ను అధఃపాతాలానికి తొక్కకపోతే నాపేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పి నేడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని అన్నారు. నీ అహంకారం నేడు నీ కన్నతల్లి, సొంత చెల్లి కూడా ఛీ కొట్టారు. అది నీ బ్రతుకు తెలుసుకో జగన్ రెడ్డి అని అన్నారు. నువ్వు చర్లపల్లి జైలుకి ఎక్కువ తీహార్ జైలుకి తక్కువ అది తెలుసుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చెబుతామని రేణుకా రాజు హెచ్చరించారు.

Share this content:

Post Comment