జనసేన నేతల అక్రమ అరెస్టులను ఖండించిన చీపురుపల్లి జనసేన

చీపురుపల్లి నియోజవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన సందర్భంగా పరిణామాలకు విశాఖ గర్జన పేరుతో మంత్రులందరూ జనసేనాని తీవ్రంగా విమర్శించడం, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి విమర్శలు చేయడం, ఆ పరిమాణాలకు కారుకులైన మంత్రులుదే తప్ప, జన సైనికులకు ఎటువంటి సంబంధం, ఎయిర్పోర్టులో ఏదో మంత్రులపైన దాడి జరిగినట్లుగా ఏదో జనసైనికులది తప్పుగా, చూపిస్తూ భావిస్తున్నట్లుగా, అదంతా జనసైనికులకు ఎటువంటి సంబంధంలేని విషయం, మీ వైసీపీ గవర్నమెంట్ సెక్యూరిటీ వైఫల్యం తప్ప పవన్ కళ్యాణ్ కి ఎటువంటి సంబంధం లేదు. గవర్నమెంట్ మంత్రులు ఉద్దేశ్ పూర్వకంగా ఈ మూడు రోజులు కార్యక్రమాన్ని నీరుగార్చాలని ఉద్దేశంతో అర్ధరాత్రి జనసేన నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఇది తీవ్రంగా మేము జనసైనికులు అందరం పరిగణిస్తున్నాం. ఏదైతే అర్ధరాత్రిని మా నాయకులును అరెస్టు చేశారు. మా వాళ్లందర్నీ విడుదల చేయాలి, లేకపోతే జనవాణి కార్యక్రమం జరుగుతుందో లేదో తెలియదు గానీ, పోలీస్ స్టేషన్లు ముట్టడికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. కావున విశాఖపట్నం సిపి, ఎస్పీ అందరూ ఈ మూడు రోజులు కార్యక్రమాన్ని సహకరించి అరెస్టు అయిన మా జనసేన నాయకులని జనసైనికులను విడుదల చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. లేనిపక్షంలో పోలీస్ స్టేషన్ ముత్తడికి మా సైనికులు అందరూ సిద్ధంగా ఇస్తున్నాం అని హెచ్చరిస్తున్నామని అన్నారు.