స్వయంగా అడిగిన చిరంజీవి… ఓకే చెప్పిన జక్కన్న

‘బాహుబలి’ వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రo RRR (రౌద్రం రుధిరం రణం). స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీలో చరణ్, తారక్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతోంది. ఇంతటి పేరున్న ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యం అవుతున్న కారణంగా తాజాగా ఓ న్యూస్ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు….

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర పైనే కావొస్తుంది. అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఎనభై శాతం మాత్రమే పూర్తయింది. నటీనటులకు గాయాలు.. ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం మరియు కరోనా ప్రభావంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో విడుదల మరింత ఆలస్యం అవుతుంది.

ఎన్నో అవాంతరాల వల్ల ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండేళ్ల వరకు బుక్ అయ్యారు. ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’ విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అలాగే, రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ వచ్చి ఏడాదిన్నర కానుంది. మరో సంవత్సరం పాటు వీళ్ల సినిమాలు వచ్చే అవకాశమే లేదు.

ప్రస్తుతం RRR షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్… తన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఆ తర్వాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తోనూ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు, రామ్ చరణ్ మాత్రం తన సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు.

రామ్ చరణ్ ‘ఆచార్య’లో కీలక పాత్ర చేస్తుండగా… తమ సినిమా కోసం అతడి డేట్స్ అడ్జస్ట్ చేయమని చిరంజీవే స్వయంగా రాజమౌళిని కోరగా చరణ్ ను కొన్ని రోజులు రిలీవ్ చేయడానికి జక్కన్న అంగీకరించాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈ గ్యాప్‌లో తారక్‌కు సంబంధించిన షూట్ పూర్తి చేసి.. మొత్తం సినిమా నుంచి అతడిని త్రివిక్రమ్ సినిమా కోసం రిలీవ్ చేస్తారనే విషయంపై సినీ ఇండస్ట్రీలో చర్చలు నడున్నాయి.