చాకలిపాలెం చిరంజీవి సేవాసమితి ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు

డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టినరోజు సందర్భంగా చాకలిపాలెం చిరంజీవి సేవాసమితి కందాల చంటి ఆధ్వర్యంలో నాగుల్లంక గ్రేస్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగుల్లంక సర్పంచ్ యల్లమిల్లి చిట్టిబాబు కృష్ణవేణి, బొమ్మిడి ఏడుకొండలు, ఓలేటి స్వామి, కర్రీ గణపతి, సత్యనారాయణ, సత్తిబాబు, శ్రీను, మరియు కుమార్ జి పాల్గొన్నారు.