దేశానికే గొప్ప పౌరుడు చిరంజీవి: సుంకెట మహేష్

భైంసా: జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మెగా స్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య మాత్రమే కాదు యావత్ దేశానికి ఆయన అన్నయ్యగా, అభిమానిగా ఇండియన్ సినిమాకు, సమాజానికి కరోనా సమయంలో ప్రజలకు ఆక్సిజన్, రక్తదానం బ్లడ్ బ్యాంక్ ద్వారా మీరు చేసిన సేవ ఎంతో మంది అభిమానులకు స్ఫూర్తినివ్వడంలో కీలక పాత్ర పోషించింది. పద్మ విభూషణ్ మీకు ఎంతో గౌరవాన్ని కల్పించింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాం. అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.