సతీసమేతంగా రక్తదానం చేసిన మెగాస్టార్

కరోనా సెకండ్ వేవ్ సమయంలో పలు జిల్లాల్లో ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాట్లు చేసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేశారు. తన సతీమణి సురేఖతో కలిసి బ్లడ్ డొనేట్ చేశారు. గతంలో కరోనా ఫస్ట్ వేవ్‌లోనూ రక్తదానం చేయడంతో పాటు తన అభిమానులకు సైతం పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా కూడా డొనేట్ చేయడం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రక్తదాతలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే 2021 (World Blood Donor Day 2021) శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్న సోదరసోదరీమణులకు బ్లడ్ డోనర్ డే విషెస్ తెలిపారు. ఈ చిన్న పనులతో జీవితాంతం మరో వ్యక్తితో మీకు బంధం ఏర్పడుతుందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. భార్య సురేఖతో కలిసి రక్తదానం చేస్తుండగా తీసిన ఫొటోను చిరంజీవి షేర్ చేసుకున్నారు.