సీనియర్ నటుడు కైకాల నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి అని చిరంజీవి తెలిపారు.