మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన విజయనగరం జిల్లా చిరంజీవి యువత

విజయనగరం, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటులు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం సంయుక్త ఆధ్వర్యంలో గాజులరేగ మెయిన్ రోడ్ లో ఉన్న నారాయణ పబ్లిక్ స్కూల్ చైర్మన్ నారాయణరావు మాస్టారు సహాయ సహకారంతో నారాయణ స్కూల్ ఆవరణలో మెగా వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ప్రముఖ హాస్పిటల్ పి.జి. స్టార్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ముఖ్యఅతిధిగా ప్రముఖ సంఘసేవకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ పెద్దలు డాక్టర్ ఎ.ఎస్. ప్రకాశరావు హాజరై అయన మాట్లాడుతూ అభిమానులను సేవా దృక్పధంలో నిలిపిన ఘనత మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుందని, చిరంజీవి స్ఫూర్తితో అభిమానులు చేసిన సేవలు ఎనలేనివని అభిమానుల చేస్తున్న సేవలను గూర్చి అయన కొనియాడారు. మరో వక్త నారాయణ పబ్లిక్ స్కూల్ చైర్మన్ నారాయణ రావు మాస్టారు మాట్లాడుతూ రక్తదానం అన్నా, నేత్రదానం అన్నా ఠక్కున గుర్తుచ్చేది చిరంజీవి అభిమానులేనని, అన్నివర్గాల ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందించాలనే మంచి ఉద్దేశ్యంతో వైద్యశిబిరాన్ని నిర్వహించిన మెగాభిమానులను అభినందించారు. సుమారు ప్రజలు రెండువందల మందికి, స్కూల్ పిల్లలు ఓ రెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంచిపెట్టారు. ఈ శిబిరానికి పీ.జీ.స్టార్ హాస్పిటల్ వైద్యులు జనరల్ పీజీషియన్ డాక్టర్ భవాని, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్. మురళీమోహన్, పి.ఆర్.ఓ. లు సూర్యప్రకాశరావు, అభి తదితరులు సేవలందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి లోపింటి కళ్యాణ్, చిరంజీవి యువత కార్యదర్శి, జనసేన నాయకులు పిడుగు సతీష్, చిరంజీవి యువత గౌరవ సలహాదారులు, జనసేన నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్,జిల్లా చిరంజీవి యువత ఆర్గనైజేషన్ కార్యదర్శలు జనసేన పార్టీ నాయకులు శీర కుమార్, దువ్వి రాము, గురుబిల్లి రాజేష్, చిరంజీవి యువత ప్రతినిధులు గజేంద్ర, వంశీ, చిన్న తదితరులు పాల్గున్నారు.