ఓటు హక్కు వినియోగించుకున్న చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం: సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా సోమవారం పోలవరం నియోజకవర్గం ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరీ హక్కు- ఓటు…. తప్పనిసరిగా ఓటు ను వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోబలకు లొంగక్కుండా.. ఆలోచన చేసి, మనకు మంచి చేస్తారు, మన హక్కులు కాపాడే వ్యక్తిని ఎంచుకొని మంచి అవకాశం, తప్పకుండ మంచి ఉద్దేశం తో ముందు చూపుతో రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు అనే హక్కుని వినియోగించుకోవాలని తెలియజేసారు.