ప్లాస్మా దాతలకు ‘చిరు’ సత్కారo

మెగాస్టార్‌ చిరంజీవి సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరై 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను సీపీ సజ్జ‌నార్ తో క‌లిసి స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి  మాట్లాడుతూ క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని అన్నారు. ప్లాస్మా దాత‌ల‌కు ఆయన ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ప్లాస్మా డొనేషన్ అనేది ఒక యుద్ధం అని ప్లాస్మా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ప్లాస్మా చికిత్సతో కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకుంటున్నారని తెలుపుతూ.. ప్లాస్మా ఇచ్చేందుకు కరోనా‌ను జయించిన వారందరూ ముందుకు రావాలని చిరంజీవి పిలుపునిచ్చారు.