చరణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో పంచుకున్న చిరు

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల జడివాన కురిసింది. తనయుడి జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చరణ్ బాల్యం నాటి ఫొటోలను, కాలక్రమంలోని కొన్ని ఫొటోలను ఆ వీడియోలో ప్రదర్శించారు.

అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడు… అంటూ తనయుడి పట్ల మమకారాన్ని ప్రదర్శించారు. హ్యాపీ బర్త్ డే మై బాయ్ అంటూ విషెస్ తెలిపారు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తోంది. కాగా, రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అటు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కూడా అల్లూరి సీతారామరాజు లుక్ ను విడుదల చేయడం తెలిసిందే.