చిరు వేదాళం చిత్రాన్ని పక్కకు పెట్టినట్లేనా..?

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వేదాళం, లూసిఫర్ చిత్రాల రీమేక్ లకు ఓకే చెప్పాడు. వేదాళం చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాను చిరంజీవి పక్కకు పెట్టేసినట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు ఆచార్య పూర్తి కాగానే వేదాళం చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారని అంత అనుకున్నారు. కానీ సడెన్ గా చిరు లూసిఫర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

వేదాళం చిత్రాన్ని ఎందుకు పక్కకు పెట్టాడా అని అరా తీయగా..ఆ సినిమాలో హెవీ ఫైట్ సన్నివేశాలు డ్యాన్స్ నంబర్స్ ఉండటం వలన పక్కన పెట్టాడని తెలుస్తుంది. అలాగే హెవీ ఫైట్స్ డాన్స్ డిమాండ్ చేయని సినిమాలు చేయాలనుకుంటున్నారట చిరు. ఇక లూసిఫర్ చూస్తే మంచి కమర్షియల్ హంగులతో మాస్ ఎలిమెంట్స్ హీరో ఎలివేషన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో భారీ ఫైట్స్ డాన్సులు చేసి జనాలను ఇంప్రెస్స్ చేయాల్సిన పనిలేదు. అందుకే వేదాలం సినిమా నుండి మెగాస్టార్ తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. నిజంగా ఇదే కారణమా లేక మరోటా అనేది తెలియాల్సి ఉంది.