అంబటి పై ధ్వజమెత్తిన చిట్వేల్ జనసేన నాయకులు మాదాసు నరసింహ

ఏమిటీ? అంబటి రాంబాబు గారు మీరా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గురించి మాట్లాడేది?

పది కోట్లు అయినా, ఇరవై కోట్లు అయినా ఆయన ప్రభుత్వానికి ట్యాక్స్ కడ్తున్నారు.
మరి మీరు రాజుపాలెం దగ్గర ఎకరం 60 లక్షల చొప్పున కొన్న 16 ఎకరాలు కొనడానికి ఎక్కడ నుండి సంపాదించారు?
మీరు చేసే వ్యాపారం ఏమిటి?
కొండమోడు క్వారీలో దోచిన సొమ్ముకి ట్యాక్స్ కట్టారా?
సత్తెనపల్లి పట్టణంలో అక్రమంగా కట్టబెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ గదుల ద్వారా వచ్చిన ఆదాయానికి ఎంత ట్యాక్స్ కట్టారు?
మీ తమ్ముడు దోచుకెళ్ళింది ఎంత?
ఇప్పుడు మీ అల్లుడుకి దోచిపెడ్తుంది ఎంత?
మట్టి తవ్వుకుని దోచుకుంది ఎంత?
చేపలు అమ్ముకోగా వచ్చిన ఆదాయం ఎంత?
వీటన్నింటికి ట్యాక్స్ కడ్తున్నారా?
ఇళ్ళ స్థలాల కోసం సేకరించిన భూమిలో దోచింది ఎన్ని కోట్లు?
మరి దానికి ట్యాక్స్ కట్టారా?
మొన్న స్థానిక ఎన్నికల్లో ఆశావాహుల నుండి వసూలు చేసింది ఎంత?
దీనికెంత ట్యాక్స్ కట్టారు?

రాష్ట్ర ప్రభుత్వంలాగా కేంద్ర ప్రభుత్వమేమీ చిల్లర మల్లరగా చికెన్ అమ్ముకోవడం లేదు, మటన్ అమ్ముతాను అని అనడం లేదు. చీప్ గా సినిమా టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి అప్పులున్నా మీలా తుగ్లక్ నిర్ణయాలతో పిచ్చి పిచ్చి పన్నులేస్తూ పిచ్చి పనులు చేయడం లేదు. అయినా రాష్ట్ర సంపద అయిన విశాఖ ఉక్కు ప్రైవేటు పరమౌతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి భాద్యత లేదా? కేవలం మీ నాయకుడికున్న కేసుల వల్ల కేంద్రంతో పోరాడలేక, పోరాడే పవన్ కళ్యాణ్ వంటి వారిని చూసి ఓర్వలేక సైకోల్లాగా మీరు ప్రవర్తిస్తూ మమ్మల్ని అంటారా?
మీభాష, మీ మాటతీరు చూస్తుంటేనే ప్రజలకి విడమరిచి చెప్పనవసరం లేదు. సైకోగాళ్ళెవరో స్పష్ఠమైపోతుంది.
ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడితే మీరు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుని అష్ఠాచమ్మా ఆడుకుంటారా?
రాజకీయ అజ్ఞానం ఎవరిదో ప్రజలకు ఈపాటికి అర్ధమైపోయింది.

ఊకదంపుడు ఉపన్యాసాలు మీవి అని ప్రజలకి తెలిసిపోయింది. నోరుందిగదా అని అవాకులు చెవాకులు పేలి, ఆనక ఆడవాళ్ళకి భయపడి సెక్యూరిటీ పెంచుకుని తిరుగుతున్న మీరు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవారేనా? అని మాదాసు నరసింహ అన్నారు.