చిట్వేలి టౌన్ చిరంజీవి యువత అధ్యక్షులుగా పగడాల శివ ఏకగ్రీవ ఎన్నిక

చిట్వేలి టౌన్ చిరంజీవి యువత అధ్యక్షులుగా చిట్వేల్ గ్రామానికి చెందిన చిరంజీవి అభిమాని మరియు జనసేన నాయకుడు పగడాల శివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై చెప్పిన పని తూచా తప్పకుండా నిర్వహిస్తున్న పగడాల శివ ను ఏకగ్రీవంగా నియమిస్తూ చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి నాయుడు ఆదేశాలు మేరకు కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్ ఎన్నుకున్నారు. పగడాల శివ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీకి ఎల్లవేళల తోడు ఉంటానని అన్నారు. నన్ను గుర్తించి చిరంజీవి యువత చిట్వేలి టౌన్ అధ్యక్షునిగా నియమించినందుకు గౌరవ అధ్యక్షులు మెగా బ్రదర్ నాగబాబు గారికి, అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి నాయుడు గారికి, ఫైర్ బ్రాండ్ తాతంశెట్టి నాగేంద్ర గారికి, రాష్ట్ర అధ్యక్షులు భవాని రవికుమార్ గారికి, జిల్లా అధ్యక్షులు పండ్ర రంజిత్ గారికి, మాదాసు నరసింహ మామ గారికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వహిస్తూ అభిమాన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పగడాల శివ తెలిపారు.