వడ్డాది-గంధవరం రహదారి పునర్నిర్మాణంపై చోడవరం జనసేన చర్యలు

వడ్డాది నుంచి గంధవరం వరకు ఉన్న ఆర్‌ & బి రహదారి పునర్నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ దృష్టికి చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు తీసుకెళ్లారు. అనకాపల్లి కార్యాలయంలో పార్లమెంటు సభ్యులను కలసి, రహదారి దుస్థితి వల్ల ప్రజలు పడుతున్న ఇక్కట్లు, తరచూ ప్రమాదాలు జరిగి గాయాలు, ప్రాణనష్టం కలుగుతున్న అంశాలను వివరిస్తూ చర్యలు కోరారు. సి.ఎం. రమేష్ వెంటనే ఆర్‌ & బి శాఖ ఉన్నతాధికారులు మరియు కాంట్రాక్టర్ సంస్థ యాజమాన్యంతో సమావేశమై, రహదారి పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ చర్చల అనంతరం, కాంట్రాక్టు యాజమాన్యం రెండు వారాల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రహదారి పునర్నిర్మాణంపై ప్రాధాన్యతతో స్పందించిన సి.ఎం. రమేష్ కి, చోడవరం నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు డి. పరమేశ్వరరావు పాల్గొన్నారు.

Share this content:

Post Comment