యూఏఈ జనసేన ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుక

యూఏఈ, క్రిస్మస్ పండుగ సందర్భంగా దుబాయ్ లో ఉన్న క్రిస్టియన్ సోదరులతో యూఏఈ జనసేన ఘనంగా క్రిస్మస్ వేడుక నిర్వహించింది.
యూఏఈ జనసేన ఈ సందర్భంగా వారిచే కేక్ కట్ చేయించి జనసేనకు సంఘీభావం ప్రకటించవలసిందిగా కోరడం జరిగింది. వారందరూ సానుకూలంగా స్పందించి వచ్చే 2024 ఎన్నికలలో జనసేనకు పనిచేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూఏఈ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.