బిగ్ బీ ఇంట క్రిస్మస్ వేడుకలు

నేడు క్రిస్మస్.. క్రైస్తవులే కాక హిందువులు కూడా ఈ పండుగని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. వేడుకకి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకను ఘనంగా జరుపుకుంది. తమ ఇంట్లో క్రిస్మస్ చెట్టును అందంగా అలంకరించి అక్కడ ఫొటోలు దిగారు. ప్రతి ఒక్కరు క్యూట్ స్మైల్‌తో ఫొటోకి ఫోజులివ్వగా ఈ ఫొటోలు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.