విద్యార్ధులకు నోట్ బుక్స్, పెన్సిల్స్ మరియు స్వీట్స్ పంపిణీ చేసిన చుండూరు జనసేన

వేమూరు, చుండూరు మండలం మండూరు గ్రామ ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి నోట్ బుక్స్, పెన్సిల్స్ మరియు స్వీట్స్ పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో చుండూరు మండలం జనసేన నాయకులు దేవిరెడ్డి మహేష్, యాసం జగదీష్, నీలం రాము, యాసం అనిల్, రెడ్డి గోపి, రెడ్డి విఘ్నేశ్వరరావు, సాయి బాలాజీ, యాసం అనిల్, రామారావు, బాబు, నాగూర్, కళ్యాణ్, నీలాంబరం, మరియు జనసైనికులు పాల్గొన్నారు.