‘మా’ అధ్య‌క్షుడు న‌రేశ్‌పై సినీ న‌టి హేమ ఆరోపణ‌లు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటోన్న వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. మా అధ్యక్షుడు నరేశ్‌పై తాజాగా సినీ నటి హేమ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాల‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. లేదంటే ఎన్నికలు లేకుండా నరేశ్‌నే మ‌ళ్లీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.  అధ్యక్ష ప‌ద‌వి నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

అంతేగాక‌, మా నిధుల‌పై కూడా హేమ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే నరేశ్‌ ఇప్పటివరకు ఖర్చు చేశారని ఆమె చెప్పారు. మిగతా డ‌బ్బంతా ఏమైంద‌ని నిల‌దీశారు.  200 మంది అసోసియేషన్‌ సభ్యులకు హేమ లేఖలు రాశారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా ప‌డ‌కుండా త‌ప్ప‌కుండా జరిగేలా చూడాలని ఆమె సంతకాలు సేకరించారు.