నిరుద్యోగ యువతకు సీపెట్ ఉచిత శిక్షణ

హైదరాబాద్‌: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ (సీపెట్‌) నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. ప్రస్తుతం 3నెలల మెషిన్‌ ఆపరేటర్‌ అసిస్టెంట్‌ ప్లాస్టిక్స్‌ ఎక్స్‌ట్రూషన్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. అభ్యర్థులు 8, 10వ తరగతి పూర్తి చేసి, కనీసం 18 ఏండ్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ.3లక్షలకు మించని ఓబీసీ అభ్యర్థులు, కుటుంబ ఆదాయం రూ.లక్ష మించని ఈబీసీ అభ్యర్థులు కూడా ఉచిత శిక్షణకు అర్హులని వెల్లడించింది. ధ్రువీకరణ పత్రాలతో చర్లపల్లిలోని సీపెట్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1000 స్టైఫండ్ అందిస్తారు. మరిన్ని వివరాలకు 9959333417 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపింది.