భారత దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన భద్రత అందిస్తున్న పారా మిలిటరీ దళం (సీఐఎస్ఎఫ్) ఏర్పడి 55ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సురక్షిత తీరం.. సమృద్ది భారత్’ పేరుతో దేశ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 7న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బఖాళీలో ప్రారంభించిన ర్యాలీ సోంపేట, శ్రీకాకుళం, విశాఖపట్నం, అన్నవరం, అమలాపురం మీదుగా నరసాపురం చేరుకుంది. ఈ ర్యాలీలో 60 మంది పాల్గొన్నారు. ఈ నెల 15న ఆంధ్రప్రదేశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఓఎన్జీసీ కార్యాలయం వద్ద సైకిల్ బృందానికి నరసాపురలోని ఓఎన్జీసీకి చెందిన సీఐఎస్ఎఫ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు బొమ్మిడి సునీల్, పోలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాహస ప్రక్రియగా అభివర్ణించారు. దేశ భద్రతలో సీఐ ఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంతం వెంబడి ఆరు వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టడమే కాకుండా తీర ప్రాంత ప్రజలకు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా అవగాహన కల్పించడం అభినందనీయం అన్నారు. సైకిల్ యాత్ర చేపట్టి జల మార్గం ద్వారా జరిగే సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఆనందదాయకమన్నారు. నరసాపురం ఏరియా ఓఎన్టీజీఎస్ సీఐఎస్ఎఫ్ విభాగం అసిస్టెంట్ కమాండర్ ఎస్ కె సట్ పతి మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ నిర్వహించే కార్యకలాపాలను వివరించారు. సుమారు 2 లక్షలకు పైగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది 1969 నుండి దేశం నలుమూలలా అంతర్గత పరిరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు తెలిపారు. దేశం మొత్తంలో 25 రాష్ట్రాలలో 358 పైగా యూనిట్లలో అను నిత్యం కోట్ల మంది ప్రజల సురక్షిత ప్రయాణాలకు, లక్షల కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణకు, శాంతి భద్రతలలో ముఖ్య భూమిక పోషి స్తున్నట్లు చెప్పారు. 56వ సంవత్సరంలో అడుగు పెట్టిన సీఐఎస్ఎఫ్ ఈ నెల 7న పశ్చిమ బెంగాల్ లోని బఖాలి నుంచి ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎన్ ఎస్ నరసాపురం ఏరియా సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు, సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వలవల నాని, గంట కృష్ణ, పోశెట్టి నళిని, పోలిశెట్టి సాంబ పాల్గొన్నారు. వీరంతా సైకిల్ ర్యాలీ చేపట్టిన బృంద సభ్యులను అభినందనలతో ముంచెత్తారు.
Share this content:
Post Comment