సిటీ బస్ సర్వీసులు ప్రారంభం

కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సిటీ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. హైదరాబాద్ నగర శివార్లలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు ఆరు నెలల తర్వాత నగర శివార్లలో ఆర్టీసీ సబర్బన్, ముఫిసిల్ బస్సు సర్వీసులు పరుగులు పెడుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి 200లకు పైగా బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ఇక నగరంలో ఆర్టీసీ బస్సుల ప్రారంభంపై రెండు, మూడు రోజుల్లో అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు. అన్ని ఆర్టీసీ డిపోలను ఉన్నతాధికారులు అలర్ట్ చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.